‘హ్యాష్‌ట్యాగ్ 90s’ అనే వెబ్ సిరీస్‌తో కంటెంట్ క్రియేటర్ మౌళి, నటుడిగా మంచి గుర్తింపు సంపాదించాడు. శివాజీ ప్రధాన పాత్రలో నటించిన ఆ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయింది, మౌళికి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత మౌళి హీరోగా మారి చేసిన ‘లిటిల్ హార్ట్స్’ సినిమా కూడా బాగా వర్కౌట్ అయింది. కామెడీ నేపథ్యంగా సాగిన ఈ సినిమా, నిర్మాతలకైతే కాసుల వర్షం కురిపించింది.
Also Read:Pawan Kalyan – Dil Raju: రావిపూడి పంట పండింది పో!
‘ఈటీవీ విన్’ ఒరిజినల్‌గా రూపొందించబడిన ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తే వర్కౌట్ అవుతుందని భావించి, ఈ సినిమాని బన్నీ వాసు, వంశీ నందిపాటి కలిసి థియేటర్లలో రిలీజ్ చేశారు. కేవలం మూడు, నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్‌లో రూపొందించబడిన ఈ సినిమా, థియేటర్లలోనే దాదాపుగా 30 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
Also Read:గ్రీన్ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తున్న రెజినా కాసాండ్రా..
అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మౌళికి ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ అడ్వాన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఏకంగా రెండో సినిమాకే కోటి రూపాయల రెమ్యూనరేషన్ కూడా వారు ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. నిజానికి, హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నంలో రెండో సినిమా దక్కించుకోవడమే గగనం అయిపోతున్న ఈ రోజుల్లో, మౌళి ఏకంగా రెండో సినిమాకే కోటి రూపాయల క్లబ్‌లోకి ఎంటర్ కావడం అనేది ఆసక్తికరమైన విషయం అనే చెప్పాలి.
