Site icon NTV Telugu

Mohanlal : స్ట్రీమింగ్‌కు వచ్చేసిన ‘ఎల్2 ఎంపురాన్’

‘l2 Empuraan’

‘l2 Empuraan’

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, విలక్షణ నటుడు కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ఎల్2 ఎంపురాన్’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇది బ్లాక్‌బస్టర్ చిత్రం ‘లూసిఫర్’కు సీక్వెల్‌గా వచ్చింది. దీంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపారు. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోయి రూ.250 కోట్లకు పైగా వ‌సూళ్లను రాబ‌ట్టింది. ఈ సినిమాలో టోవినో థామస్, మంజు వారియర్, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా. ఈ చిత్రానికి దీపక్ దేవ్ సంగీతం అందించారు. కాగా ఆశీర్వాద్ సినిమాస్, లైకా ప్రొడక్షన్స్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేసిన, ఈ పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.

Also Read: Prabhas : ‘ది రాజా సాబ్’ పై దర్శకుడు మారుతి సాలిడ్ అప్డేట్..

ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్‌ లో నేటి నుంచి ఈ చిత్రం తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, తమిళ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది. ఇక థియేటర్ లో మిస్ అయిన వారు OTT లో చూసి ఎంజాయ్ చేయండి.

 

Exit mobile version