NTV Telugu Site icon

Mohan Babu: మీడియా సిబ్బందిపై మోహన్‌బాబు సెక్యూరిటీ దాడి

Mohan Babu

Mohan Babu

మంచు ఫ్యామిలీ కేసులు, కొట్లాటల క్రమం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. తన తండ్రి అనుచరులు దాడి చేశారని నిన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న మంచు మనోజ్ ఒంటిమీద గాయాలున్నట్టు నిద్దరించారు వైద్యులు. నేడు మరోసారి మంచు మనోజ్ కు వైద్యులు సిటి స్కాన్ చేశారు.

Allu Arjun: అమితాబ్ బచ్చన్@ అల్లు అర్జున్ ఫ్యాన్.. మాస్ ఎలివేషన్ మావా ఇది!

మెడ భాగంలో స్వల్ప గాయం అయినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఇదిలా ఉండగా మరోపక్క తిరుపతి శివారులో ఉన్న మంచు మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీ బయట అక్కడి సిబ్బంది దౌర్జన్యానికి దిగారు. అక్కడ మీడియా సిబ్బందిపై రాడ్లు, కర్రలతో మోహన్‌బాబు సెక్యూరిటీ దాడి చేశారు.. బౌన్సర్లతో తమపై దాడి చేశారని ఇద్దరు మీడియా ప్రతినిధుల ఆరోపణలు చేస్తున్నారు.