టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు మొదట విలన్స్‌గా చేసి, ఆ తర్వాత హీరోలుగా మారి, ఆ తర్వాత స్టార్ హీరోలు వాళ్లను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. అలాంటి వారిలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక్కరు. విలక్షణ పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి, తన సినీ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన విజయాలు అందుకున్నాడు. అలా నటన పరంగా తనకంటూ పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న మోహన్ బాబు తోటి హీరోలకు గట్టి పోటీ ఇచ్చారు. కానీ గత కొంత కాలంగా మోహన్ బాబు కొంతవరకు సినిమాలు తగ్గించాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అప్పుడప్పుడు మేరుస్తూ, ప్రస్తుతం తన కొడుకుల సినిమా ‘కన్నప్ప’లో మాత్రమే నటిస్తున్నారు మోహన్ బాబు.
Also Read: Sleeping Problems : ప్రెగ్నెన్సీ లో నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..!
చెప్పాలంటే ఆయన ఎలాంటి పాత్రనైనా సరే చేసి అలవోకగా మెప్పించగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి. కనుక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగితే ఆయనకు మంచి అవకాశాలు లైన్ కడతాయి. ఇక దాదాపు 45 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న మంచు మోహన్ బాబు, తాజాగా తన నటన జీవితంలో యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా అభిమానులకు పిలుపందించాడు. నేటి సాయంత్రం రంగంపేటలో ఏడు గంటలకు విందు ఏర్పాటు చేశారు మోహన్ బాబు.