స్వర్గీయ కరుణానిధి తనయుడు స్టాలిన్ తొలిసారి డీఎంకే పార్టీ పగ్గాలు చేతపట్టి, తమిళనాడులో విజయ బావుటా ఎగరేశాడు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఈ నెల 7న ప్రమాణస్వీకారం చేయబోతున్నాడు. అలానే ఇప్పటి వరకూ నటన, చిత్ర నిర్మాణంకే పరిమితమైన స్టాలిన్ తనయుడు ఉదయనిధి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి, శాసన సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఈ సందర్భంగా కమల్ హాసన్ ఈ తండ్రీ కొడుకులను కలిసి, శుభాకాంక్షలు తెలిపారు. మూడేళ్ళ క్రితం కమల్ హాసన్ సొంత పార్టీ మక్కల్ నీది మయంను పెట్టాడు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఆశలతో తన అభ్యర్థులను నిలబెట్టాడు, వాళ్ళెవరూ గెలవలేదు సరికదా, కమల్ సైతం ఓటమి పాలయ్యాడు. అయినా… డీఎంకే విజయాన్ని స్వాగతిస్తూ కమల్… కాబోయే ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిసి అభినందించడాన్ని కోలీవుడ్ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.
తండ్రీ కొడుకులకు కమల్ హాసన్ శుభాకాంక్షలు
