పిజె ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెంబర్ 2గా ప్రవీణ్ జోల్లు నిర్మాణంలో ఖుషి రావు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం మిషన్ మాయ. ఈ చిత్ర పోస్టర్లు రవీంద్రభారతిలో డైలాగ్ కింగ్ సాయికుమార్, నటుడు ఆలీ, మామిడి హరికృష్ణ చేతుల మీదగా లాంచ్ చేశారు. ఈ చిత్రాన్ని పూర్తిగా ఐఫోన్లో తీయడం ప్రత్యేకత అయితే చిత్రానికి ఎక్కువగా ఆధునిక టెక్నాలజీ అయినటువంటి ఏఐ ను బాగా ఉపయోగించడం జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు ఖుషి రావు మాట్లాడుతూ… “ప్రస్తుతం ఉన్న మార్కెట్ ను చూసుకొని ఒక కొత్త ఐడియాతో సినిమా చేద్దామని వచ్చాను. సాధారణంగా ఎప్పుడు చేసే విధంగా సినిమా చేస్తే ఓకే కానీ నేను ఏఐ టెక్నాలజీతో, సౌండ్ ఎఫెక్ట్స్, వి ఎఫ్ ఎక్స్, మ్యూజిక్ తో వచ్చినప్పుడు అది పూర్తిగా ఒక ఎక్స్పరిమెంట్. అటువంటి ఎక్స్పరిమెంట్ చేస్తున్న సమయంలో ఈ చిత్రంలో నటించేందుకు నటీనటులు రావడం అనేది మామూలు విషయం కాదు. ఈ చిత్రాన్ని ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఐఫోన్ లో చేయడంతో ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపుతో ముందుకు వెళుతుంది అనుకుంటున్నాము” అన్నారు.
Mission Maya: ఐఫోన్ తో షూటింగ్ చేసి, AI టెక్నాలజీతో ‘మిషన్ మాయ’

Mission Maya