Site icon NTV Telugu

Mirai : ‘మిరాయ్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ..

Mirai 1day Calection

Mirai 1day Calection

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మిరాయ్’ ఎట్టకేలకు విడుదలైంది .  రిలీజైన మొదటి షో నుండి విశేషంగా ఆకట్టుకున్న ఈ మూవీ, ప్రేక్షకులతోపాటు రామ్‌గోపాల్ వర్మలాంటి సెలబ్రిటీలు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  మొదటి రోజే థియేటర్ల వద్ద యూత్, ఫ్యామిలీ ఆడియన్స్  రావడంతో , బంపర్ ఓపెనింగ్ వచ్చాయి . దీంతో తాజాగా ఈ సినిమా..

Also Read : Esther Noronha : రెండో పెళ్లికి సిద్ధమైన స్టార్ సింగర్ మాజీ భార్య..

ప్రపంచవ్యాప్తంగా రూ.27.20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించిందని మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు అధికారిక పోస్టర్‌ను విడుదల చేశారు. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, వీకెండ్ కలెక్షన్స్ మరింత భారీగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ‘మిరాయ్’కు మంచి రిస్పాన్స్ రావడంతో, ఫస్ట్ వీక్ మొత్తంలోనే మంచి నంబర్స్ రాబట్టే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి, ‘మిరాయ్’ తేజ సజ్జా కెరీర్‌లో మాత్రమే కాదు, తెలుగు సినిమా బాక్సాఫీస్‌లో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ప్రారంభం అయింది. మొదటి రోజు రికార్డ్ స్థాయి వసూళ్లతో ఈ సినిమా భవిష్యత్తులో మరిన్ని కలెక్షన్ రికార్డులు క్రియేట్ చేస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version