Site icon NTV Telugu

Manchu Bonding : కరుగుతున్న ‘మంచు’.. మనోజ్ సినిమాకు విష్ణు స్పెషల్ విషెష్

Manchu

Manchu

మంచు కుటుంబంలోని తండ్రికొడుకుల మధ్య కొన్ని నెలల క్రితం నెలకొన్న వివాదం ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే.  మరి ముఖ్యంగా మోహన్ బాబు వారసులైన మంచు విష్ణు – మంచు మనోజ్ లు తమ అనుచరులతో కలిసి ఇంతటి రచ్చ చేసారో. ఒకరిపై ఒకరు దాడులు, కేసులు వరకు వెళ్ళింది ఈ వ్యవహారం. కానీ ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియదు కానీ ఉన్నట్టుండి ఈ వివాదం సైలెంట్ అయింది.

Also Read : MiraiReview : మిరాయ్ ఓవర్శీస్ రివ్యూ

మంచు ఫ్యామిలీలో ఈ వివాదం నడుస్తున్నపుడే మంచు విష్ణు, మోహన్ బాబు నటించిన కన్నప్ప రిలీజ్ అయింది. ఆ టైమ్ లో తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో టీమ్ కు విషెష్ తెలియజేసాడు మనోజ్. అలాగే వ్యక్తిగత కక్షలు పక్కన పెట్టి మరి మంచు మనోజ్ ఈ సినిమాను స్వయంగా థియేటర్ కి వెళ్లి సినిమా చూసి కన్నప్ప టీమ్ పై ప్రశంసలు కురిపించాడు. అసలు క్లైమాక్స్ లో అంత బాగా నటిస్తాడని అనుకోలేదని పరోక్షంగా అన్న విష్ణునుద్దేశించి వ్యాఖ్యానించాడు. అప్పట్లో ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఇప్పుడు మంచు మనోజ్ విలన్ గా నటించిన మిరాయ్ ఈ రోజు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో మిరాయ్ టీమ్ కు Wishing all the best for  Mirai. God speed to the entire team. అని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసాడు విష్ణు. పగలు, పంతాలు, మొహమాటాలు ఇవన్నీ తాత్కాలికం. అన్నదమ్ముల ప్రేమ అన్నిటికంటే ముఖ్యం అని మీరు ఇలానే కలిసి ఉండాలని విష్ణుకి మంచు ఫ్యాన్స్ థాంక్స్ చెప్తూ రిప్లై ఇస్తున్నారు. 

Exit mobile version