పాపులర్ కమెడియన్ మధునందన్ హీరోగా ‘గుండె కథ వింటారా’ అనే థ్రిల్లర్ మూవీ రూపొందుతోంది. స్వతిష్ఠ కృష్ణన్, శ్రేయ నవిలే హీరోయిన్లు గా నటిస్తున్నారు. డైరెక్టర్ వంశీధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘గుండె కథ వింటారా’ చిత్రాన్ని ట్రినిటీ పిక్చర్స్ బ్యానర్‌పై క్రాంతి మంగళంపల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మసాలా కాఫీ మ్యూజిక్ సమకూరుస్తుండగా.. కృష్ణ చైతన్య పాటలు రాస్తున్నారు. రవివర్మన్ నీలిమేఘం, సురేష్ భార్గవ్ సినిమాటోగ్రాఫీ అందించారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఎంత బావుందో’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. మనసుకు హత్తుకుంటున్న ఈ మెలోడీ సాంగ్ కు కృష్ణ చైతన్య లిరిక్స్ అందించారు. క్రిష్ణ జెకే, వరుణ్ సునీల్ ఈ సాంగ్ ను ఆలపించారు. మీరు కూడా మెలోడియస్ సాంగ్ ‘ఎంత బావుందో’ లిరికల్ వీడియోను వీక్షించండి.
గుండె కథ వింటారా : ‘ఎంత బావుందో’ మెలోడీ లిరికల్ వీడియో సాంగ్
