ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ప్రస్తుతం ‘రంగమార్తాండ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరాఠీలో ఘన విజయం సాధించిన ‘నటసమ్రాట్’కు ఇది తెలుగు రీమేక్. అక్కడ నానా పటేకర్ చేసిన పాత్రను ఇక్కడ ప్రకాశ్ రాజ్ పోషిస్తున్నారు. ఆయనతో పాటు రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివానీ రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కృష్ణవంశీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మాస్ట్రో ఇళయరాజా స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఇప్పుడు మరో స్టార్ అట్రాక్షన్ యాడ్ అయ్యింది. అదే మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్. అన్నయ్య చిరంజీవి తన ‘రంగమార్తండ’ మూవీకి వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టు కృష్ణవంశీ మంగళవారం తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు. దానికి సంబంధించిన ఓ ఫోటోనూ పోస్ట్ చేశారు. మెగా వాయిస్ ‘రంగమార్తాండ’ కీర్తికిరీటంలో మరో కలికితురాయిగా నిలుస్తుందనే ఆశాభావాన్ని ఈ సందర్భంగా కృష్ణవంశీ వ్యక్తం చేశారు. ఈ సినిమాను డిసెంబర్ మాసంలో జనం ముందుకు వచ్చే ఆస్కారముంది.
కృష్ణవంశీ ‘రంగమార్తాండ’కు మెగాస్టార్ వాయిస్ ఓవర్!
