NTV Telugu Site icon

Megastar Chiru : సత్యదేవ్ లాంటి వెర్సటైల్ యాక్టర్స్ తెలుగులో కరువైపోయారు.

Zeebra

Zeebra

టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. జీబ్రా మూవీ నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు.

జీబ్రా మెగా ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. కొన్ని ఫంక్షన్స్ కి రావడం ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ప్రేమతో పిలిస్తే వస్తాను.  ఇక్కడ ఆ ప్రేమ అభిమానం మెండుగా లభిస్తుంది. ఈరోజుల్లో కంటెంట్‌ బాగుంటే దాన్ని ఆస్వాదించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటున్నారు. దానికి ఉదాహరణ హనుమాన్, కమిటీ కుర్రాళ్ళు, డిజె టిల్లు 2, ఆయ్, మత్తువదలరా 2. మొన్న దీపావళికి లక్కీ భాస్కర్, క, అమరన్ ఎంతో ఆదరణ పొందాయి. జీబ్రా ట్రైలర్ చూసినప్పుడు మంచి కంటెంట్ తో ఉందని అర్థమవుతుంది . కచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ బొమ్మ అవుతుంది. సత్యదేవ్ నాకు ఇంకో తమ్ముడు. తను చూపించే ప్రేమలో ఎక్కడా కల్మషం ఉండదు. తన మొదటి చూసినప్పుడు నేను తెలుగు యాక్టర్ అనుకోలేదు. కానీ తను మన వైజాగ్ అబ్బాయి తెలిసినప్పుడు పిలిచి మాట్లాడాను. గాడ్ ఫాదర్ లో విలన్ రోల్ లో తను అత్యద్భుతంగా అతను అద్భుతంగా రాణించాడు. సత్యదేవ్ లాంటి వెర్సటైల్ యాక్టర్స్ మనకి తెలుగులో కరువైపోయారు. తనకి భవిష్యత్తులో బోలెడన్ని అవకాశా జీబ్రాలో తను చాలా షటిల్డ్ పెర్ఫార్మన్స్ తో చేశాడు. తనకి మరింత బ్రైట్ ఫ్యూచర్ ఏర్పడుతుందని భావిస్తున్నాను. తమ్ముడు సత్యదేవ్ కి ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నాను. అన్నారు.

Show comments