NTV Telugu Site icon

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి చికెన్ గున్యా.. 25 రోజుల నుంచే?

Chiranjeevi

Chiranjeevi

Megastar Chiranjeevi: చికెన్ గున్యా అనే పేరుకు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రతి ఏటా కొన్ని లక్షల మంది దీని బారిన పడుతూనే ఉంటున్నారు. ఈ వైరస్ సోకిందంటే మనిషి మనిషిలా ఉండ లేడు. తీవ్రంగా జ్వరం, కీళ్ల నొప్పులతో సతమతమవుతూ ఉంటారు. ముఖ్యంగా ఒళ్లంతా నొప్పులతో తీవ్రంగా ప్రభావం చూపిస్తుందని చెప్పొచ్చు. చికెన్ గున్యా సోకిన వ్యక్తికి మరో వ్యక్తి సహాయం ఉంటేనే లేవడానికి ఓపిక ఉంటుంది. ఇప్పుడు అలాంటి జ్వరం బారిన మెగాస్టార్ చిరంజీవి పడ్డారు. ఇది వినడానికి షాకింగ్ గా ఉన్నా నిజమే. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పేరును గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు చేశారు. 22 సెప్టెంబర్ 2024న భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత సక్సెస్ ఫుల్ చలనచిత్ర నటుడిగా, డాన్సర్ గా మెగాస్టార్ చిరంజీవి కొణిదెలని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది.

Also Read: Chiranjeevi: బ్రేకింగ్: గిన్నీస్ బుక్ లోకి చిరంజీవి

ఆసక్తికరంగా 1978లో మెగాస్టార్ అరంగేట్రం చేసిన రోజు కూడా సెప్టెంబర్ 22 కావడం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి 46 సంవత్సరాల కాలంలో తన 156 సినిమాల్లో 537 పాటల్లో 24000 డ్యాన్స్ మూవ్స్ చేశారు అందుకు గాను ఆయనకు ఈ రికార్డు లభించింది. ఈ ప్రకటనను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధితో పాటు బాలీవుడ్ స్టార్ట్ హీరో ఆమీర్ ఖాన్ చేశారు. ఈ ఈవెంట్ కు హాజరైన క్రమంలో యాంకర్ మెగాస్టార్ చిరంజీవి గత 25 రోజులుగా చికెన్ గున్యాతో బాధ పడుతున్నారు అని వెల్లడించింది. అయినా ఈ రికార్డు అందుకున్న క్రమంలోనే ఈ వేడుకకు హాజరయ్యారు అని వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి ఒకపక్క చికెన్ గునియాతో 25 రోజుల నుంచి బాధపడుతున్నా సరే తన జీవితంలో ఒక అరుదైన ఘట్టం కావడంతో నీరసంగా కనబడుతున్న కూడా హాజరయ్యారు. దీంతో అభిమానులు ఆయన గిన్నీస్ రికార్డు క్రియేట్ చేసుకున్నందుకు అనందపడుతున్నా మరోపక్క ఈ విషయం తెలిసి బాధ పడుతున్నారు.