మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే విశ్వంభర సినిమా పూర్తి చేశారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. #Mega157 లేదా #MegaAnil అనే పేరుతో సంభోదించబడుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఇక మూడవ షెడ్యూల్ జూలై 1వ తేదీ నుంచి ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు నయనతార సొంత ఇలాకా ఆయన కేరళలో ఈ షూట్ జరగబోతోంది.
Also Read:ReginaCassandra : పొట్టి దుస్తుల్లో రెచ్చగొడుతున్న రెజీనా
అయితే ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్ పూర్తికాగా రెండు షెడ్యూల్ కు సంబంధించిన రషెస్ మెగాస్టార్ చిరంజీవి చూశారని, చూసిన తర్వాత అవుట్ ఫుట్ విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహు గారపాటితో పాటు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Also Read:Kubera : కుబేరకు కలిసొచ్చిన రష్మిక సెంటిమెంట్..
ఈ సినిమాలో నయనతారతో పాటు కేథరిన్ తెరెసా హీరోయిన్ గా నటిస్తోంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో పాటు మెగాస్టార్ చిరంజీవి మార్క్ ఎంటర్టైన్మెంట్ ఉండేలా ఈ సినిమాని రాసుకున్నారు. సినిమా హిలేరియస్ గా ఉందని సంక్రాంతికి వస్తున్నాము కంటే మించి పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అనిల్ టీం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. మొత్తం మీద ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ ముందుకు వెళ్లడం గమనార్హం.
