Site icon NTV Telugu

Vishwak sen: షూటింగ్ పూర్తి కాకుండానే రైట్స్ సేల్..రిలీజ్ ఫిక్స్..

Untitled Design (6)

Untitled Design (6)

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సినిమాలు విడుదల చేసాడు ఈ యంగ్ హీరో . గామీ బ్రేక్ ఈవెన్ సాధించగా, గ్యాంగ్స్ అఫ్ గోదావరి యావరేజ్ టాక్ తో సరిపెట్టుకున్నా నిర్మాతలకు బాగానే గిట్టుబాటు అయింది. ప్రస్తుతం మిడ్ రేంజ్ హీరోలలో నిర్మాతలకు హాట్ ఫేవరేట్ విశ్వక్ సేన్ అనడంలో సందేహం లేదు. విశ్వక్ తో సినిమా చేస్తే మినిమం గ్యారెంటీ అనే పేరు ఉంది. ఓటీటీలోను విశ్వక్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుండడంతో  సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు.

కాగా విశ్వక్ ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. రవితేజ ముళ్ళపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. మరోవైపు ఈ చిత్రం థియేట్రీకల్ రైట్స్ డీల్ క్లోజ్ చేసారు నిర్మాత. మెకానిక్ రాకీ ఆల్ ఇండియా థియేట్రికల్ రైట్స్ రూ.8 కోట్లకు కొనుగోలు చేసినట్టు ఏషియన్, సురేష్ సంస్థలు ప్రకటించాయి. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ను లాక్ చేసింది నిర్మాణ సంస్థ. మెకానిక్ రాకీ చిత్రన్ని ప్రపంచ వ్యాప్తంగా దీపావళి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహకాలు ప్రారంభించారు నిర్మాత. విశ్వక్ సేన్ సినీ కెరియర్ లో 10వ చిత్రంగా రాబోతోంది మెకానిక్ రాకీ. విశ్వక్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ జాక్స్ బెజోయ్ సంగీతం దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

Also Read: OTT Trending : ఓటీటీ రికార్డులు బద్దలు కొడుతున్న మహారాజ.

Exit mobile version