NTV Telugu Site icon

MechanicRocky : మొన్న చూసుకున్న చాలా కాన్ఫిడెంట్ గా వున్నాను : విశ్వక్ సేన్

Mecanic Raki

Mecanic Raki

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అప్ కమింగ్ మూవీ ‘మెకానిక్ రాకీ’ ఫస్ట్ గేర్, సాంగ్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. డెబ్యుటెంట్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ 1.0 కు అద్భుత స్పందన లభించింది. విశ్వక్ సేన్ ఈ చిత్ర విజయంపై చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు.

Also Read : Kalyani Priyadarshani : సీరియల్ నటుడితో పెళ్లి.. ఫ్యాన్స్‏కు షాకిచ్చిన భామ..?

ఈ చిత్ర విజయంపై మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితిలో ఏడాదికి మూడు సినిమాలు రిలీజ్ చేయడం చాలా తక్కువ మందికి కుదురుతుంది. ఇంతదూరం వచ్చానంటే ఈ జర్నీలో ఇద్దరే వున్నారు. ఒకటి నేను, రెండు మీరు. నన్ను ఇక్కడివరకూ తీసుకొచ్చింది మీ అభిమానమే. నవంబర్ 22 సినిమా రిలీజ్. సినిమా మొన్న చూసుకున్న. చాలా కాన్ఫిడెంట్ గా వున్నాను. నవంబర్ 21, 7.30కి పెయిడ్ ప్రిమియర్స్ వేస్తాం. యూఎస్ షో కంటే ముందే చుసుకుకోండి. అంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నా. సినిమా ఎడ్జ్ అఫ్ ది సీట్ ఎక్స్ పీరియన్స్ చేస్తారు. రెండోసారి సినిమా చూసే రేంజ్ లో వుంది.సెకండ్ హాఫ్ థియేటర్స్ అన్నీ అడిటోరియమ్ లా మారిపోతాయి. రిలీజ్ దగ్గరలో మరో ట్రైలర్ రిలీజ్ అవుతుంది. నిర్మాత రామ్ గారు చాలా సపోర్ట్ గా నిలిచారు. ఈ సినిమాలో ఆయనకి చాలా డబ్బులు రావాలి. శ్రద్ధ వండర్ ఫుల్ కో స్టార్. మీనాక్షి కి థాంక్ యూ సో మచ్. మా కెమిస్ట్రీని చాలా ఎంజాయ్ చేస్తారు. డైరెక్టర్ రవి థాంక్ యూ సో మచ్. జేమ్స్ బిజోయ్ బీజీఎం ఇరగదీశాడు. టీంలో పని చేసిన అందరికీ థాంక్ యూ. ఫ్యాన్స్ అందరికీ లవ్ యూ సో మచ్. నవంబర్ 22న థియేటర్స్ లో కలుద్దాం’ అన్నారు.

Show comments