Site icon NTV Telugu

Allu Arjun: పాత గాయం రేపేలా అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు??

Allu Arjun

Allu Arjun

Allu Arjun Comments at Maruthi Nagar Subramanyam Pre Release Event : కొద్దిరోజుల క్రితం తనకు వరుసకు మామయ్య అయ్యే పవన్ కళ్యాణ్ జనసేనకు కేవలం సోషల్ మీడియా వేదికగా సపోర్ట్ చేసాడు అల్లు అర్జున్. అదే సమయంలో తన భార్య స్నేహితురాలు భర్త తన స్నేహితుడు అని చెప్పుకుంటూ వైసిపి నేత శిల్పా రవిచంద్ర రెడ్డికి నేరుగా వెళ్లి అల్లు అర్జున్ మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ఈ విషయం మీద చాలా చర్చలు జరిగాయి. మెగా అల్లు ఫ్యామిలీ ల మధ్య దూరం పెరిగింది అని కూడా ప్రచారం జరిగింది. ఈ విషయం మీద ఇప్పటికీ మెగా అల్లు కాంపౌండ్స్ కి చెందిన వాళ్ళు కవర్ చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గాయం ఇంకా మానక ముందే ఆ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రావు రమేష్ ప్రధాన పాత్రలో లక్ష్మణ్ డైరెక్ట్ చేసిన మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా 23వ తేదీన రిలీజ్ అవుతుంది.

Chiranjeevi: మెగా విశ్వంభరుడు.. బర్త్ డే స్పెషల్

ఈ సినిమాని సుకుమార్ భార్య ప్రజెంట్ చేస్తున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సుకుమార్ తో పాటు అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఈ సినిమాని సుకుమార్ భార్య ప్రజెంట్ చేస్తున్నారు. మేము పుష్పా 2 క్లైమాక్స్ షూటింగ్లో ఉండగా ఆమె వచ్చి సుకుమార్, మిమ్మల్ని కాకుండా నేను ఈ సినిమా ఈవెంట్ కి ఎవరిని పిలవగలను అని అన్నారు. అయితే ఇప్పటివరకు నేను చేస్తున్న అన్ని సినిమాల్లో అతి కష్టమైన షూటింగ్ పుష్ప 2 క్లైమాక్స్. అలాంటి పరిస్థితిలో కూడా ఆమె కేవలం పిలిచిందని వచ్చాను. ఇష్టమైన వారిపైన మన ప్రేమ చూపించాలి, మనం నిలబడగలగాలి, నాకు ఇష్టమైతేనే వస్తా నా మనసుకు నచ్చితేనే వస్తా అంటూ కామెంట్స్ చేశారు. ఆయన సుకుమార్ భార్య ఆహ్వానం మేరకు వచ్చిన దాని గురించే మాట్లాడినా సోషల్ మీడియాలో మాత్రం శిల్పా రవిచంద్ర రెడ్డికి మద్దతు పలికిన విషయం గురించి మరోసారి ఆయన తన స్టాండ్ వెల్లడించారు అనే చర్చ జరుగుతోంది. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి.

Exit mobile version