Site icon NTV Telugu

Mark Robin : సత్తా చాటిన మార్క్ కె రాబిన్

Mark Robin

Mark Robin

‘అ!’ సినిమాతో ప్రయాణం మొదలు పెట్టిన సంగీత దర్శకుడు మార్క్ కె రాబిన్ అనతి కాలంలోనే టాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకున్నారు. చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అన్న తేడాను చూడకుండా తన మార్క్‌ను చూపిస్తూ వచ్చారు మార్క్ కె రాబిన్. తాజాగా తెలంగాణ ప్రభుత్వం అతడి ప్రతిభకి తగ్గ పురస్కారాన్ని అందించింది. “8AM Metro”తో మార్క్ బాలీవుడ్ లో అడుగు పెట్టారు. అక్కడ ఫస్ట్ మూవీతోనే బెస్ట్ మ్యూజిక్ ప్రొడ్యూసర్’గా ఐరా అవార్డును సాధించారు. అలా మెట్టు మెట్టు ఎదుగుతూ వస్తున్న మార్క్ కె రాబిన్‌కి గద్దర్ అవార్డుతో ఇప్పుడు తగిన గుర్తింపు లభించినట్టు అయింది. ‘దండోరా’ చిత్రానికి గానూ మార్క్ కె రాబిన్‌కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గద్దర్ అవార్డు లభించింది.

మార్క్ కె రాబిన్ అందించిన పాటలు, ఇచ్చిన సోల్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌కి, మరీ ముఖ్యంగా “దండోరా” టైటిల్ సాంగ్ ప్రేక్షకులను కదిలించాయి. ‘దండోరా’ సినిమాని తన ఆర్ఆర్‌తో మరో స్థాయికి తీసుకు వెళ్లిన మార్క్ కె రాబిన్‌కి తెలంగాణ ప్రభుత్వం సముచిత గౌరవాన్ని ఇచ్చింది. చిన్నప్పటి నుంచీ గద్దర్ పాటలు అంటే ఇష్టమని, అవి పాటలు కాదు ఫైర్ అని, ఆయన పాటలు వింటూ పెరిగిన తనకు ఈనాడు గద్దర్ అవార్డు రావడం ఆనందంగా ఉందని అన్నారు. తనకు ఈ అవార్డుని, గుర్తింపును ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వంకు, సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి, జ్యూరీ మెంబర్లకు మార్క్ కె రాబిన్ ధన్యవాదాలు తెలిపారు.

Exit mobile version