విక్రమ్ సహిదేవ్, సౌమిక పాండియన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ “కొత్తగా రెక్కలొచ్చేనా”. ప్రదీప్ బి అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా… రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని “మనసా నిన్నలా లేదే” లిరికల్ వీడియో సాంగ్ ప్రముఖ సింగర్ సునీత విడుదల చేశారు. ఈ మెలోడీ సాంగ్ కు గోపీచంద్ లగడపాటి లిరిక్స్ అందించగా… అచ్చు రాజమణి ఆలపించారు. సంగీత దర్శకుడు అచ్చు రాజమణి స్వయంగా ఈ పాట కోసం స్వరం అందించడం విశేషం. యూత్ ను విశేషంగా ఆకట్టుకుంటున్న “మనసా నిన్నలా లేదే” మెలోడీ లిరికల్ వీడియో సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.
కొత్తగా రెక్కలొచ్చేనా : “మనసా నిన్నలా లేదే” లిరికల్ వీడియో సాంగ్
