Site icon NTV Telugu

ఆహాలో మమ్ముట్టి ‘వన్’!

Mammootty One Movie from July 30 on Aha

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన రెండు సినిమాలు ఈ యేడాది మార్చిలో థియేటర్స్ లో బ్యాక్ టు బ్యాక్ విడుదలయ్యాయి. అందులో మొదటిది మార్చి 11న రిలీజ్ అయిన ‘ది ప్రీస్ట్’ కాగా రెండోది అదే నెల 26న వచ్చిన ‘వన్’. సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ‘ది ప్రీస్ట్’ను ఏప్రిల్ లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేశారు. ఇప్పుడు ‘వన్’ మూవీని తెలుగులో డబ్ చేసి, ఆహాలో ఈ నెల 30వ తేదీ స్ట్రీమింగ్ చేయబోతున్నారు.

Read Also : సమంత కొత్త లుక్ అదిరిపోయింది…!

పొలిటికల్ డ్రామాగా సంతోష్ విశ్వనాథ్ తెరకెక్కించిన ‘వన్’ మూవీలో మమ్ముట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నటించారు. ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించాలని కలలుకనే ఈ ముఖ్యమంత్రి అవినీతి పరులైన మంత్రులను, శాసన సభ్యులను ఏరివేయడానికి ‘రైట్ టు రీకాల్’ ను అమలు చేయాలని భావిస్తాడు. అయితే అవినీతిలో కూరుకుపోయిన ఈ సమాజంలో ఉన్నత భావాలు కలిగిన ముఖ్యమంత్రి ఆశయాలు నెరవేరాయా? లేదా? అన్నదే చిత్ర కథ. మురళీ గోపీ, జోజు జార్జ్, సిద్ధిక్, మాథ్యూ థామస్, ఇషానీ కృష్ణ, గాయత్రి అరుణ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు గోపీ సుందర్ స్వరాలు అందించారు. మరి ఈ పొలిటికల్ డ్రామాను తెలుగు వీక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.

Exit mobile version