NTV Telugu Site icon

Mahesh Babu: శ్రీవారి సేవలో సూపర్ స్టార్ కుటుంబ సభ్యులు..

Untitled Design 2024 08 15t085042.948

Untitled Design 2024 08 15t085042.948

టాలివుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంభసభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు.తిరుమల శ్రీవారి దర్శనార్దం బుధవారం శ్రీవారి మెట్ల మార్గం గుండా కాలినడకన తిరుమల చేరుకున్నారు మహేష్ బాబు సతీమణి నమ్రతా శిర్కోదర్, కుమారుడు గౌతమ్, కూతురు సితార. గురువారం వేకువజామున స్వామివారి సుప్రభాత సేవలో పాల్గోని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనాలు అందుకున్నారు, అనంతరం మహేశ్ బాబు కుటంబ సబ్యులకు టీటీడీ అధికారులు స్వామివారి తీర్దప్రసాదాలు అందజేసారు. మహేశ్ కుటుంబ సభ్యులతో కలసి మేఘా గ్రూప్ డైరెక్టర్ సుధా రెడ్డి కూడా శ్రీవారి సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమలో నటించబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సెప్టెంబరులో వర్క్ షాప్ ప్రారంభించి డిసెంబర్ నుండి రెగ్యులర్ షూట్ స్టార్ చేయనున్నారు మేకర్స్. లొకేషన్స్ వేటలో ఉంది యూనిట్. ఫస్ట్ షెడ్యూల్ ను జర్మనీలో స్టార్ట్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు గోల్డ్ అనే యూనివర్సల్ టైటిల్ పరిశీలనలో ఉంది.

Also Read: Mr bachchan: మిస్టర్ బచ్చన్ లో కనిపించిన నైజాం నయా నవాబ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ ఎవరంటే..?

Show comments