సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం “సర్కారు వారి పాట”. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగానే అన్ని భారీ బడ్జెట్ మూవీలతో పాటు ఈ చిత్రం షూటింగ్ కూడా ఆగిపోయింది. ఇటీవల లాక్ డౌన్ ఎత్తేయడంతో పలువురు స్టార్స్ తమ సినిమాల షూటింగులను రీస్టార్ట్ చేసేశారు. అయితే మహేష్ బాబు మాత్రం ఇంకా మొదలు పెట్టలేదు. తాజా అప్డేట్ ప్రకారం “సర్కారు వారి పాట”ను మహేష్ బాబు త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాడట. ప్రస్తుతం తాను నాన్ స్టాప్ షూటింగ్ కోసం రెడీగా ఉన్నానని మేకర్స్ కు తెలియజేశాడట.
Read Also : అమీర్ ఖాన్, కిరణ్ రావు విడాకులపై కంగనా కామెంట్స్
వచ్చేవారం “సర్కారు వారి పాట” షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ షెడ్యూల్ సుదీర్ఘంగా సాగనుందని అంటున్నారు. ఈ షెడ్యూల్ ముగిసిన తర్వాత యూనిట్ హైదరాబాద్‌లో మరో యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తోంది. ఈ షెడ్యూల్‌తో మెజారిటీ షూటింగ్ పూర్తవుతుంది. మహేష్ ఇప్పటికే ఈ చిత్రం కోసం బల్క్ డేట్స్ కేటాయించగా… హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేష్ కూడా తన భాగం షూటింగ్ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది. “సర్కారు వారి పాట” షూటింగ్ రెండు నెలల్లో పూర్తి కానుందని సమాచారం.
