2002లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అందమైన కుటుంభ ప్రేమకథ చిత్రం ‘నువ్వు లేక నేను లేను’ అంత చూసే ఉంటారు. హీరో తరుణ్ కు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ఇది. కానీ ఈ సినిమాలో అసలు మొదటగా మహేశ్ బాబు తో చేయాలనుకున్న విషయం ప్రజంట్ ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ సినిమాకి దర్శకత్వం వహించిన కాశీ విశ్వనాథ్ ఒక ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయం వెల్లడించారు..
Also Read : Tharun Bhascker : యాంకర్‌కి లైవ్ ఈవెంట్‌లో ప్రపోజ్ చేసిన స్టార్ డైరెక్టర్..
‘సినిమా స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత, నిర్మాత సురేష్ బాబు ఈ కథను మహేశ్ బాబుతో చేద్దామా? అని అడిగారు. దానికి కాశీ విశ్వనాథ్ స్పందిస్తూ – ‘మహేశ్ తో సినిమా అంటే ఇంకా ఆలస్యం అవుతుంది. ఆయన డేట్స్ కోసం పెద్ద లైన్ ఉంటుంది. ఇప్పటికే నాకు ఆలస్యమైంది. ఇదే తరుణ్‌కు బాగా సరిపోతుంది’.. ఆయన ‘నువ్వే కావాలి’ తో హిట్ ఇచ్చాడు కదా.. అని చెప్పారు. అలా చివరికి మహేశ్ బాబు అవకాశాన్ని వదిలివేయడంతో తరుణ్ ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించడంతో పాటు, ఆయన కెరీర్‌కు మరో మైలురాయిగా నిలిచింది’ అని తెలిపారు.. ఒక కథ, ఒక నిర్ణయం.. నటుడి భవిష్యత్తునే మార్చేస్తుంది అనడానికి ఇదే నిదర్శనం.
