విజసేతుపతి రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘మహారాజ’. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ మౌత్ టాక్ తో సంచనాలు నమోదు చేసింది. ఈ చిత్రంలో విజయసేతుపతి నటనకు తమిళ్ తో పాటు తెలుగు రాష్టాల ప్రేక్షకులు కూడా భ్రమరథం పట్టారు.తెలుగులోనూ ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.
మహారాజ చిత్రం ఏపీ తెలంగాణ థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేశారు ఎన్వీ ప్రసాద్. ఏపీ, తెలంగాణలో ఎవరు ఊహించని రీతిలో సుపర్ హిట్ టాక్ తెచ్చుకొని పంపిణీదారులకు భారీ లాభాలు ఆర్జించి పెట్టింది. కాగా మహారాజ ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది. థియేటర్లలో 50 రోజలుకు పైగా ప్రదర్సింపడిన ఈ చిత్రం తమిళనాడులో 100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సెన్సేషనల్ హిట్ సాధించింది. ఇటివల ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ కు ఉంచింది నెట్ ఫ్లిక్స్ సంస్థ. ఊహించినట్టుగానే ఈ చిత్రం ఓటీటీలో రికార్డులు బ్రేక్ చేస్తుంది. ఈ వారం నెట్‌ఫ్లిక్స్ ఇండియా నంబర్ -1లో ట్రెండింగ్‌లో అవుతోంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నటనకు సూపర్ స్టార్ రజనికాంత్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు “X” వేదికగా ప్రశంసించారు. అదే విధంగా ఈ చిత్రంలో కథ, స్క్రీన్ ప్లే తో దర్శకుడు నిథిలన్ స్వామినాధన్ కట్టిపడేసాడు. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. కాగా ఈ దర్శకుడు తన రెండవ సినిమాను నాయనతార ముఖ్యపాత్రలో చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Also Read : Kamal haasan : భారతీయుడు వచ్చాడు…కానీ ప్రేక్షకులే రావట్లేదు..ఎందుకని..?