Site icon NTV Telugu

వకీల్ సాబ్ : ‘మగువా మగువా’ ఫిమేల్ వెర్షన్ వీడియో సాంగ్

Maguva Maguva Female Version from VakeelSaab Full Video Out Now

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో అనన్య నాగళ్ళ, నివేతా థామస్, అంజలి కీలక పాత్రలు పోషించగా పవన్ కి జోడీగా శృతి హాసన్ కనిపించింది. ప్రకాష్ రాజ్ లాయర్ గా ఓ పవర్ ఫుల్ రోల్ లో కనిపించారు. ఈరోజు నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతోంది. తాజాగా ‘వకీల్ సాబ్’ నుంచి అందరి మనసులను దోచేసిన ‘మగువా మగువా’ ఫిమేల్ వెర్షన్ కు సంబంధించిన వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ సినిమా విడుదలకు ముందే అందరి మదిలో చోటు సంపాదించుకుంది. సినిమాలో మాత్రం ఈ సాంగ్ ప్రేక్షకులను ఎమోషనల్ గా కట్టిపడేసింది. ‘మగువా మగువా’ ఫిమేల్ వెర్షన్ వీడియో సాంగ్ కోసం ఎంతగానో ఎదురు చూసేలా చేసింది. తాజాగా విడుదలైన ‘మగువా మగువా’ ఫిమేల్ వెర్షన్ వీడియో సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.

Exit mobile version