Site icon NTV Telugu

Madham: జనవరి 1న “మదo”

Madham

Madham

హార్డ్-హిట్టింగ్ డ్రామా థ్రిల్లర్ చిత్రం “మదo” న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్త సంవత్సర ఆరంభంలోనే శక్తివంతమైన సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు ఈ చిత్రం సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు సూర్య దేవర రవీంద్ర నాథ్, రమేష్ బాబు కోయ లు మాట్లాడుతూ “ఏకైవా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మా చిత్రం రాజీ లేని కథనంతో రూపొందింది. ఈ చిత్రంలో హర్ష గంగవరపు, ఇనాయ సుల్తానా, అనురూప్, లతా రెడ్డి కీలక పాత్రల్లో నటించారు.

చిత్ర కథ, సంభాషణలను రమేష్ బాబు కోయ అందించగా, కథనానికి మరింత న్యాచురాలిటీ జోడించారు. ఈగల్ ఫేమ్ డేవ్‌జాండ్ (DavZand) అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విశేషంగా ప్రశంసలు అందుకుంది. ఎడిటింగ్ బాధ్యతలను నందమూరి తారకరామారావు నిర్వర్తించగా, సినిమాటోగ్రఫీని రవి వి అందించారు. చిత్రానికి రా మరియు ఇమర్సివ్ విజువల్ టెక్స్చర్‌ను అందించారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి ‘A’ సర్టిఫికెట్ లభించింది, ఇది చిత్రంలోని తీవ్రతను మరియు వాస్తవికతను ప్రతిబింబిస్తుంది అన్నారు.

Exit mobile version