యద్దనపూడి మైకిల్ దర్శకత్వంలో అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మాతలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం మా రాముడు అందరివాడు. శ్రీరామ్, స్వాతి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరో సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్, ఆనంద్ భారతి, జబర్దస్ అప్పారావు, చిట్టి బాబు, గడ్డం నవీన్, లక్ష్మణ్ రావు తదితరులు కీలకపాత్రలు పోషించారు. మనిష్ కుమార్ సంగీత దర్శకత్వంలో వినోద్ సినిమాటోగ్రాఫర్ గా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలో పాన్ ఇండియా స్థాయిలో యాక్షన్, డ్రామా, సస్పెన్, ఎమోషన్స్ చిత్రంలో క్యారీ చేస్తూ ఈ చిత్రం రానుంది. నర్ర సాయికుమార్ కోరియోగ్రఫీ చేయగా గీత మాధురి, రమ్య బెహర, నల్గొండ గద్దర్ నరసన్న, మనీష్ కుమార్ ఈ చిత్రంలోని పాటలను తన స్వరాన్ని అందించారు. త్వరలో ప్రేక్షకులను వెండి తెరపై అలరించనున్న ఈ చిత్ర టీజర్, ఆడియో లాంచ్ కార్యక్రమం పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో లాంచ్ కావడం జరిగింది.
Maa Ramudu Andarivadu: ఆసక్తికరంగా “మా రాముడు అందరివాడు” టీజర్

Ramudu Andarivadu