Site icon NTV Telugu

Actress Hema: హేమకు అండగా ‘మా’… కానీ షరతులు వర్తిస్తాయ్!

Manchu Vishnu Supports Hema

Manchu Vishnu Supports Hema

MAA Lifts Suspension on Actress Hema: బెంగళూరు రేవ్ పార్టీలో అడ్డంగా బుక్ అయిన సరే తాను హైదరాబాద్ లో ఉన్నానంటూ ఒక వీడియో రిలీజ్ చేసి పెను వివాదానికి కారణమైంది నటి హేమ. బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో తన పేరును కృష్ణవేణిగా నమోదు చేసిన ఆమె తన అసలు బెంగళూరు వెళ్ళలేదు అని ఆమె చెప్పిందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో పోలీసులు ఆమె మీద డ్రగ్స్ కేసుతో పాటు కేసును తప్పు దోవ పట్టిస్తుందని మరో కేసు కూడా నమోదు చేశారని ఆ మధ్య ప్రచారం జరిగింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేసింది. అందులో ఆమె తాను డ్రగ్స్ తీసుకోలేదు అని మరోసారి చెప్పే ప్రయత్నం చేసింది.

Allu Arjun: మెగాస్టార్ లేకపోతే మీరంతా ఎక్కడ ? అల్లు అర్జున్ పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

అందుకు సంబంధించి తాను టెస్టులు కూడా చేయించుకున్నానని ఆమె వెల్లడించింది. ‘’కొన్ని నెలలుగా నా మీద మీడియాలో చాలా పుకార్లు పుట్టాయి, అది మీ అందరికీ తెలుసు. మీడియా వాళ్ళు 35 సంవత్సరాలుగా నేను సంపాదించుకున్న పరువు ఎలా భూస్థాపితం చేశారో మీ అందరికీ తెలిసిందే అని అంటూ చెప్పుకొచ్చింది. ఇక తాజాగా సినీ నటి హేమపై సస్పెన్షన్‌ ఎత్తివేశారు. హేమపై సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ ‘మా’ నిర్ణయం తీసుకుంది. అయితే మీడియాతో మాట్లాడొద్దని హేమకు ‘మా’ షరతులు విధించింది.

Exit mobile version