Site icon NTV Telugu

Abbas : తిరిగి రావడానికి సిద్ధమైన ‘లవర్ బాయ్’ అబ్బాస్!

Abbas

Abbas

ఒకానొక సమయంలో తమిళ, తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన నటుడు అబ్బాస్. 90ల దశకంలో ‘ప్రేమదేశం’, ‘శీను’, ‘జస్టిస్ చౌదరి’, ‘  అవును వాల్మీ’ వంటి సినిమాల్లో తన అందం, అభినయంతో యువతను ఎంతగానో ఆకట్టుకున్న అబ్బాస్‌కు, ‘లవర్ బాయ్’ ఇమేజ్ తెచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. అయితే, ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో కొంతకాలం విదేశాల్లో స్థిరపడి, సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. చివరిసారిగా ఆయన 2014లో విడుదలైన తమిళ బయోపిక్ ‘రామానుజన్’ చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత సినిమాలకు దూరమై పోయిన అబ్బాస్, తాజాగా మళ్లీ వెండితెరపై కనిపించేందుకు సిద్ధమవుతున్నారు.

Also Read : Fahadh Faasil : పాత్రల ఎంపికలో లాజిక్ ఉండాలి..

ఇప్పుడు ఆయన తిరిగి సినిమాల్లోకి రావాలనుకోవడం సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వివిధ వర్గాలలో వినిపిస్తున్న వార్తల ప్రకారం, అబ్బాస్ ప్రస్తుతం ఒక మల్టీ-స్టారర్ సినిమాలో కీలక పాత్రకు ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇదో ఇంటెన్స్ ఫ్యామిలీ డ్రామా, లేదా సస్పెన్స్ థ్రిల్లర్ కావచ్చని ఇండస్ట్రీ బజ్. గతంలో హీరోగా వెలిగిన ఆయన, ఇప్పుడు నెగిటివ్ షేడ్స్ కలిగిన రోల్స్ చేయడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. దీనికి తోడు ఆయన తాజా లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అబ్బాస్ వయసు పెరిగినా, ఇప్పటికీ ఆయనలో ఉన్న హ్యాండ్సమ్ లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం మారలేదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కొత్త తరం హీరోలతో కలిసి అబ్బాస్ ఓ బలమైన క్యారెక్టర్ రీ ఎంట్రీ ఇస్తే, అది తాను గతంలో చేసిన క్యారెక్టర్‌లకు సీరియస్ వెర్షన్ అయ్యే ఛాన్స్ ఉంది.

Exit mobile version