సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు రేపు (మే 9). ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ బర్త్ డే సీడీపీ తాజాగా విడుదలైంది. అనతికాలంలో విశేషంగా అభిమానులను సంపాదించుకున్న విజయ్ దేవరకొండ బర్త్ డే సెలబ్రేషన్స్ ను సోషల్ మీడియాలో ముందుగానే స్టార్ట్ చేశారు ఆయన అభిమానులు. నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో ఎలాంటి సపోర్ట్ లేకుండానే సొంత ట్యాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగి కొత్తగా రాబోయే యువతరం నటీనటులకు స్ఫూర్తిగా నిలిచారు. ‘పెళ్లిచూపులు’ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు విజయ్. ఆ తరువాత విజయ్ హీరోగా నటించిన ‘ద్వారకా’ తీవ్రంగా నిరాశ పరిచినప్పటికీ ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. ఈ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపును పొందిన ఈ రౌడీ హీరోకు బాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత ‘నోటా’ చిత్రంతో తెలుగు, తమిళ బైలింగ్వల్ చిత్రం చేశాడు. ఇదే విజయ్ కోలీవుడ్ ఎంట్రీ మూవీ. కానీ ఆ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది విజయ్ అభిమానులను. తరువాత విజయ్ హీరోగా నటించిన టాక్సీవాలా, డియర్ కామ్రేడ్ చిత్రాలు ఫర్వాలేదన్పించాయి. ‘రౌడీ వేర్’ బ్రాండ్ తో ఓ గార్మెంట్స్ కంపెనీ కూడా పెట్టాడు. ఇక కొన్ని సంస్థలకు విజయ్ బ్రాండ్ అంబాసిడర్ గానూ సాగుతున్నాడు. ప్రజలకు సాయం చేసేందుకుదేవరకొండ ఫౌండేషన్ కూడా నెలకొల్పాడు. ‘మీకు మాత్రమే చెప్తా’ చిత్రంతో నిర్మాతగానూ మారాడు. ఆ తదుపతి చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం కూడా భారీ అంచనాలతో విడుదలైంది. కానీ అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు విజయ్. ఈ చిత్రానికి కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రేక్ పడింది. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో తాను భారీవిరాళం ఇవ్వడమే కాకుండా, మిత్రులు శ్రేయోభిలాషుల ద్వారా సేకరించిన నిధితోనూ బాధితులకు సాయం అందించి మంచి మనసున్న హీరోగా అభిమానుల ప్రేమాభిమానాలను సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ.
విజయ్ దేవరకొండ బర్త్ డే సీడీపీ రిలీజ్
