నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా “లవ్ స్టోరీ”. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 16న థియేటర్లలో సందడి చేయాల్సింది. కానీ కరోనా, లాక్ డౌన్ కారణంగా ఈ లవ్ స్టోరీ విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతుండడంతో ఈ నెల చివరి తెలుగు రాష్ట్రాల్లో 50 శాతం సామర్థ్యంతో థియేటర్లు తిరిగి తెరుచుకోనున్నాయి అనే ఊహాగానాలు విన్పిస్తున్నాయి. లవ్ స్టోరీ విడుదల విషయంలో పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే “లవ్ స్టోరీ” నిర్మాతలలో ఒకరైన సునీల్ నారంగ్ తాజా ఇంటర్వ్యూలో సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతే “లవ్ స్టోరీ” థియేటర్లలో విడుదల అవుతుంది అని ఆయన అన్నారు. “థియేటర్లలో రోజుకు 3 ప్రదర్శనల కు మాత్రమే అనుమతిస్తే… ఆ సమయంలో “లవ్ స్టోరీ”ని రిలీజ్ చేయాలనీ అనుకోవట్లేదు. నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతే “లవ్ స్టోరీ” విడుదల చేయడం గురించి ఆలోచిస్తాము. జూలై రెండవ వారం తర్వాత మాత్రమే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని నా అభిప్రాయం. ఈ చిత్రం విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తాము” అని సునీల్ నారంగ్ చెప్పారు.
“లవ్ స్టోరీ” రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్
Show comments