“లవ్ స్టోరీ” రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా “లవ్ స్టోరీ”. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 16న థియేటర్లలో సందడి చేయాల్సింది. కానీ కరోనా, లాక్ డౌన్ కారణంగా ఈ లవ్ స్టోరీ విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతుండడంతో ఈ నెల చివరి తెలుగు రాష్ట్రాల్లో 50 శాతం సామర్థ్యంతో థియేటర్లు తిరిగి తెరుచుకోనున్నాయి అనే ఊహాగానాలు విన్పిస్తున్నాయి. లవ్ స్టోరీ విడుదల విషయంలో పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే “లవ్ స్టోరీ” నిర్మాతలలో ఒకరైన సునీల్ నారంగ్ తాజా ఇంటర్వ్యూలో సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతే “లవ్ స్టోరీ” థియేటర్లలో విడుదల అవుతుంది అని ఆయన అన్నారు. “థియేటర్లలో రోజుకు 3 ప్రదర్శనల కు మాత్రమే అనుమతిస్తే… ఆ సమయంలో “లవ్ స్టోరీ”ని రిలీజ్ చేయాలనీ అనుకోవట్లేదు. నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతే “లవ్ స్టోరీ” విడుదల చేయడం గురించి ఆలోచిస్తాము. జూలై రెండవ వారం తర్వాత మాత్రమే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని నా అభిప్రాయం. ఈ చిత్రం విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తాము” అని సునీల్ నారంగ్ చెప్పారు.
Also Read
- Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
- Abir Singh Debut: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ కొడుకు హీరోగా ఎంట్రీ.. ‘టార్జాన్’ రాబోతున్న అబీర్, తోడుగా ఆ హీరో!
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
తాజావార్తలు
-
US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
-
Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
-
Women’s Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
-
Women’s Asia Cup 2026: ష్రీ చరణి బౌలింగ్ దెబ్బకు శ్రీలంక విలవిల.. మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!