NTV Telugu Site icon

‘ఆచార్య’ డేట్ పై కన్నేసిన ‘లవ్ స్టోరీ’ యూనిట్

Love Story Movie to Released on May 13

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల 16న నాగచైతన్య, సాయిపల్లవి ‘లవ్ స్టోరీ’ థియేటర్లలో సందడి చేస్తుండేది. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ కి వెనకడుగు వేసిన దర్శకనిర్మాతలు సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు. అయితే ఇప్పుడు తమ సినిమాను మేలో విడుదల చేయటానికి సిద్ధం అవుతున్నారు. చిరంజీవి, కొరటాల సినిమా ‘ఆచార్య’ను మే 13న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే అనివార్యకారణాల వల్ల ఆ సినిమా వెనక్కి వెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో తమ ‘లవ్ స్టోరీ’ని ‘ఆచార్య’ డేట్ కి విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారట. ఈ లవ్, రొమాంటిక్ డ్రామాకి సంబంధించి పాటలతో పాటు, టీజర్ కి కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో సినిమా సక్సెస్ పై కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహనరావు నిర్మాతలు.