NTV Telugu Site icon

Love Reddy: “లవ్ రెడ్డి” గెలిచాడు, ఇండస్ట్రీ సపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నాం!

Sravani Reddy

Sravani Reddy

Love Reddy Hero Comments at Failure Meet: గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరీ స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం “లవ్ రెడ్డి”. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటించారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథగా నూతన దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా “లవ్ రెడ్డి” సినిమా నిన్న ( 18వ తేదీ) గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో మూవీ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో అంజన్ రామచంద్ర మాట్లాడుతూ – మా మూవీకి ఆడియెన్స్ నుంచే కాకుండా ప్రెస్ నుంచి కూడా మంచి రివ్యూస్ వచ్చాయి. “లవ్ రెడ్డి” థియేటర్ లో గెలిచాడు. చూసిన వాళ్లంతా బాగుందని అంటున్నారు. ఎవరికైతే మా సినిమా రీచ్ కాకుండా వాళ్లు చూడలేకపోతే అది మా ఫెయిల్యూర్ గా భావిస్తాం. ప్రతి సినిమాలో చిన్న చిన్న తప్పులు ఉంటాయి. అయితే ఓవరాల్ గా “లవ్ రెడ్డి” సినిమాకు మూవీ చూసిన వాళ్లంతా మంచి మూవీ చేశారనే చెబుతున్నారు.

KCR Trailer: మరో బలగం లోడింగ్ లా ఉందే!

తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ మంచి సినిమాను ఆదరించడంలో ఫెయిల్ కాలేదు. వాళ్లను ఫెయిల్ చేయొద్దనే ఈ ప్రెస్ మీట్ పెట్టాం. ప్రీమియర్స్ నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్ టాక్ తో మూవీని హ్యాపీగా రిలీజ్ చేశాం. మైత్రీ డిస్ట్రిబ్యూషన్ నుంచి మా మూవీకి పూర్తి సపోర్ట్ దొరికింది. ప్రమోషన్స్ పరంగా మేము ప్రేక్షకులకు అనుకున్న స్థాయిలో రీచ్ కాలేకపోయాం. “లవ్ రెడ్డి”ని ఎలాగైనా నిలబెట్టాలని నా స్నేహితుడు కిరణ్ అబ్బవరం హైదరాబాద్ , తిరుపతి, వైజాగ్, విజయవాడలో ఫ్రీ షోస్ అరేంజ్ చేశాడు. ఆయనకు మా మూవీ టీమ్ తరుపున థ్యాంక్స్ చెబుతున్నాం. ఈ ఫ్రీ షోస్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. కొందరు తమ లైఫ్ లో జరిగిన లవ్ ఫెయిల్యూర్స్ గురించి చెబుతూ ఉద్వేగంగా మాట్లాడుతున్నారు. ఓటీటీలో మా సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది. కానీ థియేటర్ లో బ్లాక్ బస్టర్ అయితేనే మా ప్రొడ్యూసర్ కు డబ్బులు వస్తాయి. ఈ వీకెండ్ లోపు మా సినిమా బాగా పికప్ అవుతుందనే గట్టి నమ్మకంతో టీమ్ అంతా ఉన్నాం. అయితే చిత్ర పరిశ్రమ నుంచి మా మూవీకి చిన్న సపోర్ట్ దొరుకుతుందని ఎదురుచూస్తున్నాం. అన్నారు

Show comments