Site icon NTV Telugu

Love Reddy Failure meet: టాలీవుడ్ హిస్టరీలోనే మొట్టమొదటి ఫెయిల్యూర్ మీట్

Untitled 1

Untitled 1

Love Reddy Failure meet Goes Viral: టాలీవుడ్ హిస్టరీ లోనే మొట్టమొదటిసారిగా ఒక సినిమాకి ఫెయిల్యూర్ మీట్ నిర్వహించింది సినిమా టీం. ఆ సినిమా మరేమిటో కాదు లవ్ రెడ్డి. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఈ సినిమాని పలువురు నిర్మాతలు కలిసి నిర్మించారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన స్మరన్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించారు. అవుట్ అండ్ అవుట్ లవ్ డ్రామా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 18 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా మీద నమ్మకంతో ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించింది సినిమా యూనిట్. అయితే ఈ సినిమాని జనాల దగ్గరకు తీసుకువెళ్లే ఒక విషయంలో మేము ఫెయిల్ అయ్యాం.

Akira Nandan: పవన్ ఫాన్స్ కి పండగ లాంటి న్యూస్

ఈ ఫెయిల్యూర్ మీట్ అనే ఉద్దేశమే అంటూ చెప్పుకొచ్చాడు సినిమా హీరో అంజన్ రామచంద్ర. అది డిసప్పాయింట్మెంట్ కాదు దీని ద్వారా అయినా జనాల దృష్టికి మా సినిమా తీసుకువెళదాము అనుకుంటున్నాము. ఎందుకంటే మనకి ఒక స్టేట్మెంట్ ఉంది కదా తెలుగు ఆడియన్స్ మంచి సినిమాలను ఎప్పుడు ఫెయిల్ చేయలేదు అని తెలుగు ఆడియన్స్ ను ఇప్పుడు ఫెయిల్ చేయకూడదని ఈ ఫెయిల్యూర్ మీట్ పెట్టామని ఆయన చెప్పుకొచ్చారు. సినిమా బ్లాక్ బస్టర్ కానీ సినిమా ఫెయిల్ అయింది అంటూ ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది ఈ సినిమా యూనిట్. ఈ సందర్భంగా సినిమా నిర్మాతలతో పాటు హీరో హీరోయిన్లు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version