కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’. ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోన్న ఈ సినిమాపై, అభిమానులో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాలో రజనీకాంత్ ఓ మాస్ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో కనిపించనున్నారు. యాక్షన్, ఎమోషనల్ అంశాలతో కూడిన ఈ కథకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ రివీల్ వీడియో లో రజిని లుక్ సంచలనంగా మారింది. ఇక తాజాగా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు భావోద్వేగానికి లోనయ్యేలా ఉన్నాయి.
Also read :Kingdom : వాయిదాలకు గుడ్‌బై.. ‘కింగ్డమ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన లోకేశ్ కనగరాజ్.. ‘గత రెండేళ్లుగా నాకు ‘కూలీ’ తప్ప మరే విషయంపై ధ్యాస లేదు. నా కుటుంబం, స్నేహితులు, వ్యక్తిగత జీవితమంతా పక్కనపెట్టి.. నేను పూర్తిగా ఈ సినిమాకు అంకితమయ్యాను. నా 36, 37వ పుట్టినరోజులను కూడా జరుపుకోలేదు. ప్రజంట్ నాకు అలాంటి జ్ఞాపకాలు అవసరం అనిపించడం లేదు. నా సుదీర్ఘ ప్రయాణంలో ఇదొక కీలకమైన దశ. రజనీసార్ సినిమాను పూర్తి ఫోకస్‌తో చేయాలన్నది నా ఏకైక లక్ష్యం. ఎందుకంటే ‘విక్రమ్’ తర్వాత ‘లియో’ చిత్రాన్ని తక్కువ టైం లో పూర్తి చేయాలన్న ఆలోచనతో, కొన్ని ముఖ్యమైన అంశాలు పట్టించుకోలేదు. అందుకే ఈసారి మాత్రం ప్రతి చిన్న విషయాన్ని పర్ఫెక్షన్‌తో చేయడమే లక్ష్యంగా పనిచేశాను’ అంటూ తెలిపారు. ఇక ‘కూలీ’ కోసం లోకేశ్ కనగరాజ్ చేసిన త్యాగం, అతని డెడికేషన్ చూసిన తర్వాత, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ కృషికి ప్రేక్షకుల నుంచి సమాధానం ఎలా ఉంటుందో చూడాలంటే, 2025 ఆగస్టు 14 వరకు వేచి చూడాల్సిందే..
