Site icon NTV Telugu

Little Hearts : అదరగొట్టిన లిటిల్ హార్ట్స్.. మొదటి రోజు ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

Little Heatrts

Little Heatrts

#90s ఫేమ్ మౌళి లీడ్ రోల్ లో వంశి నందిపాటి నిర్మించిన చిన్న బడ్జెట్ చిత్రం లిటిల్ హార్ట్స్. సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా ఘాటీ, మధరాసి వంటి పెద్ద చిత్రాలతో పోటీగా థియేటర్లలో విడుదలైంది. కంటెంట్ పట్ల నమ్మకంతో విడుదలకు ఒక రోజు ముందుగానే ప్రీమియర్ షోలు కూడా వేశారు మేకర్స్. అదే ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. ప్రీమియర్స్ షోస్ నుండి సూపర్ హిట్ టాక్ రావడంతో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టడంలో సహాయపడింది.

Also Read : John Abraham : ఫోర్స్ -3లో హీరోయిన్ గా టాలీవుడ్ సొగసుల సుందరి

పెయిడ్ ప్రీమియర్ల నుండి రూ. 15 లక్షలకు పైగా గ్రాస్ తో  సూపర్ స్టార్ట్ అందుకున్న లిటిల్ హార్ట్స్ మౌత్ టాక్ తో మొదటి రోజు హౌస్ ఫుల్ బోర్డ్స్ పెట్టింది. ఇలా ఊహించని స్టార్ట్ అందుకున్న లిటిల్ హార్ట్స్ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు సుమారు రూ. 2.68 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అటు ఓవర్సీస్ లోను లిటిల్ హార్ట్స్ అదరగొట్టింది. మొదటి రోజు 75k డాలర్స్ తో సెన్సషన్ స్టార్ట్ అందుకుంది. ఇదే ట్రెండ్ కొనసాగితే రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాల ఫైనల్ కలెక్షన్స్ ను కూడా డేట్ ఛాన్స్ ఉంది.  చిన్న సినిమాకు ఇది భారీ నంబర్ అనే చెప్పాలి. స్టార్ వాల్యూ, భారీ ఫైట్స్, భారీ బుడ్జెట్స్ ఇవేవీ ముఖ్యం కాదు కంటెంట్ ముఖ్యమని మరో సారి నిరూపించారు ఆడియెన్స్. ఇక నేడు వీకెండ్ కావడంతో మొదటి రోజు కంటే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేస్తుంది.

Exit mobile version