అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్‘ థియేటర్లలో సంచలనం సృష్టిస్తోంది. మొదటి మూడు రోజులకు గాను రూ. 61 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి అఖిల్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందని. వీకెండ్‌లో భారీ వసూళ్లతో అదరగొట్టిన ఈ చిత్రం సోమవారం ఫస్ట్ వర్కింగ్ డే టెస్ట్ ని ఎదుర్కొంది. ట్రేడ్ అంచనాలకు తగ్గట్టే వర్కింగ్ డే రోజు కూడా డీసెంట్ హోల్డ్ చేయగలిగింది లెనిన్. సాధారణంగా ఏ సినిమాకైనా వీకెండ్ తర్వాత వచ్చే సోమవారం కలెక్షన్లు పడిపోతుంటాయి, కానీ ‘లెనిన్’ విషయంలో మాత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హోల్డ్ కనిపించింది.
ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ టాక్ కారణంగా ఈ సినిమా బుకింగ్స్ సోమవారం కూడా నిలకడగా ఉన్నాయి. ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ ‘బుక్ మై షో’లో కేవలం సోమవారం ఒక్క రోజే ఏకంగా 74 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. ఒక మిడ్-రేంజ్ సినిమాకు వర్కింగ్ డే రోజున ఈ స్థాయి బుకింగ్స్ రావడం అనేది చాలా డీసెంట్ నంబర్ అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. టికెట్ ధరలు నార్మల్ రేట్స్ ఉండడం, మౌత్ టాక్ బాగుండడం, మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే అంశాలు, అఖిల్ యాక్షన్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. ఈ సాలిడ్ వీక్‌డే రన్‌ను బట్టి చూస్తే, ‘లెనిన్’ లాంగ్ రన్‌లో మరిన్ని భారీ వసూళ్లను సాధించి అఖిల్ కెరీర్‌లోనే అతిపెద్ద కమర్షియల్ హిట్‌గా నిలిచే దిశగా దూసుకుపోతోందని స్పష్టమవుతోంది.

