NTV Telugu Site icon

కమల్ మధ్యవర్తిత్వం ఫలించేనా!?

Kamal-Haasan

Kamal-Haasan

ఇండియన్ 2… సూపర్ హిట్ ఇండియన్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం. అయితే అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, దర్శకుడు శంకర్ మధ్య దూరం మరింత పెరిగింది. ఇటీవల దర్శకుడుపై నిర్మాణ సంస్థ లీగల్ యాక్షన్ తో ఇక ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయిందనే న్యూస్ మరింతగా వ్యాప్తి చెందింది. అయితే తాజా సమాచారం మేరకు హీరో కమల్ హాసన్ ఇండియన్ 2 ని మళ్ళీ పట్టాలెక్కించే పనిలో పడ్డాడట. అటు లైకా ప్రొడక్షన్స్ ఇటు శంకర్ తో విడివిడిగా చర్చలు జరుపుతూ పరిష్కారం లభించే దిశగా అడుగులు కదుపుతున్నాడట. తొందరగా మిగిలిన షూటింగ్ మొదలు పెట్టి వీలయినంత త్వరగా పూర్తి చేయించాలని భావిస్తున్నాడట. మరి కమల్ చర్చలు ఫలించి సినిమా పూర్తయితే అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.