NTV Telugu Site icon

Laila: పృథ్వి రాజ్ కామెంట్స్ కలకలం.. షైన్ స్క్రీన్స్ కీలక ప్రకటన

Vishwak Sen Laila

Vishwak Sen Laila

లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ కమెడియన్ పృథ్వి రాజ్ చేసిన కామెంట్లు కలకలం రేపాయి. వైసీపీ నేతలను టార్గెట్ చేసినట్టుగా ఉన్న ఆ కామెంట్ల మీద కలకలం రేగడంతో టీం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో షైన్ స్క్రీన్స్ నిర్మాత సాహు గారపాటితో పాటు విశ్వక్ సేన్ మీడియా ముందుకు వచ్చి అసలేం జరిగిందో వివరించారు. ఇక తాజాగా ఈ అంశం మీద టీం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. లైలా మెగా మాస్ ఈవెంట్‌లో నటుడు 30 ఇయర్స్ పృధ్వి వ్యక్తం చేసిన ప్రకటనలు పూర్తిగా అతని వ్యక్తిగత అభిప్రాయాలు అని ప్రకటనలో పేర్కొన్నారు.

Vishwak Sen: సారీ.. నా సినిమాను చంపేయకండి !

ఆయన మాటలు పూర్తిగా వ్యక్తిగతం సినిమాలో నటించిన నటీనటులు కానీ, షైన్ స్క్రీన్‌ టీం లేదా లైలా టీం ఎవరికీ అయన మాట్లాడిన మాటలతో సంబంధం లేదని వెల్లడించారు. మా సినిమా ఎంటర్ టైన్మెంట్, హ్యూమర్ అలాగే జాయ్ తో కలగలిపిన ఒక వేడుక. మేము పాజిటివిటీ, అలాగే లవ్ ను వ్యాప్తి చేయడాన్ని గట్టిగా నమ్ముతాము, మా ఈవెంట్‌లో వ్యక్తులు చేసే ఎలాంటి రాజకీయ ప్రకటనలను మేము ఆమోదించము లేదా సమర్ధించము అని పేర్కొన్నారు. ప్రేక్షకులు ఆస్వాదించేందుకు రూపొందించిన వినోదభరితమైన చిత్రం – లైలా స్ఫూర్తిపై దృష్టి సారించాలని మేము ప్రతి ఒక్కరినీ హృదయపూర్వకంగా కోరుతున్నామని అన్నారు. ఆ విషయంలో మా ఉద్దేశాలు స్పష్టంగా ఉన్నాయి – ఫిబ్రవరి 14 నుండి థియేటర్లలో మీ అందరినీ అలరించడానికి మేము సిద్ధం అవుతున్నామని అందులో పేర్కొన్నారు.