ధనుష్ హీరోగా, నాగార్జున కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రష్మిక మందన్న ధనుష్ సరసన హీరోయిన్‌గా నటించింది. ఇక అమిగోస్ బ్యానర్‌పై శేఖర్ కమ్ములతో పాటు ఈ సినిమాని ఏషియన్ సినిమాస్ బ్యానర్‌పై ఏషియన్ సునీల్‌తో పాటు పుష్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి మంచి బజ్ ఏర్పడింది. ఈ నెల 20వ తేదీన రిలీజ్‌కి రెడీ అవుతున్న ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసేందుకు రేపు సాయంత్రం హైదరాబాద్ జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ఒక ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు.
అయితే, అహమదాబాద్‌లో లండన్ వెళ్తున్న విమానం ప్రమాదవశాత్తూ కూలిపోవడంతో 230 మందికి పైగా మరణించడంతో కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. ట్రైలర్ రేపు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తారా లేక మరో రోజు ఈవెంట్ కండక్ట్ చేసి రిలీజ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. నిజానికి మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ కూడా రేపే జరగాల్సి ఉంది. ఈ మేరకు అక్షయ్ కుమార్, మంచు విష్ణు కలిసి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక ఈవెంట్ ఏర్పాటు చేశారు. విమాన ప్రమాద నేపథ్యంలో ఆ ఈవెంట్ ప్రస్తుతమి కి క్యాన్సిల్ అయింది.
