శ్రేయాస్ చిత్ర, పూర్ణా నాయుడు ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద చైతన్య రావు మదాడి, ఐరా, సాఖీ హీరో హీరోయిన్లుగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో పూర్ణా నాయుడు, శ్రీకాంత్. వి ప్రొడక్షన్ నెంబర్ .5 ని ప్రారంభించారు. ‘ఓనమాలు’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అంటూ సెన్సిబుల్ స్టోరీలతో ఆకట్టుకున్న సెన్సిబుల్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ ఇప్పుడు మరో యూత్ ఫుల్ కథతో అందరినీ అలరించేందుకు రెడీగా ఉన్నారు. గ్యాప్ తరువాత వస్తున్న క్రాంతి మాధవ్ సరికొత్త ప్రేమ కథతో అందరినీ మెప్పించేందుకు వస్తున్నారు. దసరా సందర్భంగా ఈ మూవీని శుక్రవారం (అక్టోబర్ 3) నాడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి దేవా కట్టా క్లాప్ కొట్టగా, కె ఎల్ దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
Also Read : Ugly Story Teaser: నందు, అవికా గోర్ ‘అగ్లీ స్టోరీ’ టీజర్..ఏదో తేడాగా ఉందే !
నిర్మాతలు పూర్ణ నాయుడు, శ్రీకాంత్ స్క్రిప్ట్ అందజేయగా.. తొలి సన్నివేశానికి వర ముళ్ళపూడి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో హీరో చైతన్య రావు మాట్లాడుతూ నాకు ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చాలా ఇష్టమైన సినిమా. ఆయనకెంతో ఇష్టమైన దర్శకుడు. ఆయనతో వరుసగా రెండు చిత్రాలు చేస్తుండటం ఆనందంగా ఉంది. ఇంత కంటే ఎక్కువగా నేను ఆ దేవుడ్ని ఏదీ కోరుకోను. ‘మయసభ’, ‘ఘాటీ’ తరువాత ఇంత మంచి సినిమాను చేస్తుండటం అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఓ సినిమా చేస్తున్నాను అంటే.. ఏదో ఒకటి కొత్తగా ఉంటుందనే ఆడియెన్స్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఇదొక న్యూ ఏజ్ లవ్ స్టోరీ. క్రాంతి అన్న చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఐరా, సాఖీలకు ఆల్ ది బెస్ట్. నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.
