‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ బాంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన నిర్మాత ప్రవీణ పరుచూరి.. ఇప్పుడు ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ అనే సినిమాతో, దర్శకురాలిగా, పరిచయం అవుతున్నారు. రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి రానా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా జులై 18న ఇది విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ట్రైలర్ విడుదల చేసింది.
Also Read : Anushka : నా ఫస్ట్ లవ్ అతడితోనే.. ఇప్పటికీ మధుర జ్ఞాపకంగా మిగిలింది !
కాగా ఈ ట్రైలర్ ఊహించని ట్విస్ట్ లతో.. నాన్ స్టాప్ కామెడితో ఆకట్టుకుంది. ట్రైలర్ లో రామకృష్ణ అనే యువకుడు ఒక చిన్న పట్టణంలో డ్యాన్స్ స్టూడియో నడుపుతుంటాడు. అతను సావిత్రిని ప్రేమిస్తుంటాడు, ఆమె కూడా అతని భావాలకు స్పందిస్తున్నట్లు కనిపిస్తుంది. ఓ రోజు సావిత్రి అతన్ని గడ్డివాము వద్ద కలవమని అడుగుతుంది. ఆనందంగా వెళ్లిన రామకృష్ణ జీవితంలో అప్పటి నుంచి భారీ మలుపు తిరుగుతుంది. ఇది కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా, ఒక అనూహ్యమైన మిస్టరీ, దైవిక సంబంధాల నడుమ నడిచే కథ గా మారుతుంది. ఇక మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రల్లో నటిస్తూ తమ పాత్రలకు స్వచ్ఛమైన అమాయకత్వాన్ని తీసుకొచ్చారు. రవీంద్ర విజయ్ కూడా తన పాత్ర ద్వారా బలమైన ప్రభావాన్ని చూపిస్తున్నారు. మొత్తానికి ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడంలో సఫలమైంది. ఈ సినిమా జులై 18 న విడుదలకు సిద్ధమవుతుంది. రూటీన్ ప్రేమ కథలకు భిన్నంగా మలచిన ఈ గ్రామీణ డ్రామా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇచ్చే అవకాశం ఉంది.
