NTV Telugu Site icon

Koratala Siva: పక్కోడి పనిలో చెయ్యి.. హాట్ టాపిక్ అవుతున్న కొరటాల కామెంట్స్

Koratala Siva Birthday Special Article

Koratala Siva Birthday Special Article

Koratala Siva Sensational Comments goes Viral in Social Media: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా తెరకెక్కుతోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన మొదటి భాగం సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాని భారీగా రిలీజ్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సరసన జాహ్నవి కపూర్ హీరోయిన్గా నటించగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. శ్రీకాంత్ సహా ఎంతోమంది నటీనటులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలలో నటించారు. యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ మీద మిక్కిలినేని సుధాకర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద కళ్యాణ్ రామ్, హరికృష్ణ కొసరాజు నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కింది. రిలీజ్ టైం దగ్గర పడడంతో సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో వేగం పెంచింది. అందులో భాగంగానే ఇద్దరు కుర్ర హీరోలతో కలిసి ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. విశ్వక్సేన్ సిద్దు జొన్నలగడ్డ ఇద్దరు కలిసి జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివలను ఇంటర్వ్యూ చేశారు.

India’s wedding industry: నవంబర్, డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా 35 లక్షల వివాహాలు.. ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా..?

ఆ ఇంటర్వ్యూ తాజాగా రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు దానికి సంబంధించిన కొన్ని బిట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కొరటాల శివ చేసిన కొన్ని వ్యాఖ్యలు అయితే మరింత హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలో “మీరు భయం గురించి సినిమా చేశారు కదా.. మరి మీరు దేనికి భయపడతారు?” అని కొరటాలను సిద్ధు అడిగితే కొరటాల సంచలన సమాధానం చెప్పాడు. “మనకి ఇచ్చిన పనికి మనం జవాబుదారీ, ఆ పనిని పూర్తి చేయాలనే భయంతో, మనం దానిని పూర్తి చేస్తే.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎవడి పని వాడు చేస్తే, ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుంది. మనది మనం చెయ్యక.. పక్కనోడి పనుల్లో చెయ్యి దూర్చి, ఆయన్ని ఇబ్బందిపెట్టి.. ఇలా చేస్తేనే సమస్య.” అని కొరటాల కామెంట్ చేశారు. కొరటాల సహజ ధోరణిలోనే కామెంట్ చేసినా కొరటాల చేసిన ఈ కామెంట్స్ పరోక్షంగా చిరంజీవిని టార్గెట్ చేసినట్లు ఉన్నాయనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.

Show comments