కన్నడ నుంచి ప్రస్తుతం రూటెడ్ కథలు వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. భూతకోళ అంటూ ‘కాంతార’ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇక కర్ణాటక, కేరళ, ముంబైలోని కొన్ని ప్రాంతాలు, మరీ ముఖ్యంగా తులునాడులో పూజించబడే దైవం కొరగజ్జ కథతో కన్నడ నుంచి మరో చిత్రం రాబోతోంది. ‘కొరగజ్జ’ అనే టైటిల్‌తో రానున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ సినిమాస్, సక్సెస్ ఫిల్మ్స్ బ్యానర్‌పై త్రివిక్రమ్ సాపల్య నిర్మాతగా సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుధీర్ అత్తవర్ తెరకెక్కిస్తున్నారు.
ఈ మూవీకి గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. రీసెంట్‌గానే ఆడియో లాంఛ్‌ను మంగళూరులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాత్రధారులు విభిన్న గెటప్స్‌లో కనిపించడం, కొరగజ్జ థీమ్‌లో అందరూ ఈవెంట్‌లో సందడి చేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రంలోని పాటల్ని షారోన్ ప్రభాకర్, శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్, శంకర్ మహదేవన్, జావేద్ అలీ, అర్మాన్ మాలిక్, స్వరూప్ ఖాన్, అనిలా రాజీవ్, సుధీర్ అత్తవర్ వంటి వారు ఆలపించారు. జీ మ్యూజిక్ ద్వారా ‘కొరగజ్జ’ ఆడియో మార్కెట్లోకి వచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్, మోషన్ పోస్టర్‌లు ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని పెంచేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే సినిమాను రిలీజ్ చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంది.
