NTV Telugu Site icon

Konda Surekha Lawyer: కొండా సురేఖ పై నాగార్జున పిటిషన్ నిలబడదు!

Nagarjuna

Nagarjuna

Konda Surekha Lawyer Comments on Nagarjuna Petetion: మంత్రి కొండా సురేఖ మీద నాగార్జున పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు నాంపల్లి కోర్టు ముందు హాజరైన నాగార్జున, మొదటి సాక్షి సుప్రియ తమ స్టేట్మెంట్స్ కోర్టులో నమోదు చేశారు. ఈ క్రమంలో నాగార్జున తరపున న్యాయవాది అశోక్ రెడ్డి మాట్లాడుతూ మొదటి సాక్షిగా సుప్రియ వాంగ్మూలం కూడా రికార్డ్ చేశారని అన్నారు. ఈ నెల 10 వ తేది నా మరో సాక్షి వాంగ్మూలం రికార్డ్ చేస్తారని, ఈ నెల 10 తేదీన కొండా సురేఖకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని అన్నారు. కొండా సురేఖ మీద క్రిమినల్ పరువు నష్టం కింద చర్యలు తీసుకోవాలని నాగార్జున వాంగ్మూలం ఇచ్చారని, మంత్రి కొండా సురేఖ మాట్లాడిన వీడియోలను కోర్ట్ కు సమర్పించామని అన్నారు. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా పరువుకు భంగం కలిగించాయి కాబట్టే క్రిమినల్ పరువు నష్టం కింద చర్యలు తీసుకోవాలని పిటిషన్ ను దాఖలు చేశామని అన్నారు.

Pushpa 2: పుష్ప- 2 ది రూల్‌ ఫస్టాఫ్‌ లాక్‌..ఇక టెన్షన్ లేనట్టే!

ఇక మంత్రి కొండా సురేఖ తరపు కౌన్సిల్ మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖ పై దాఖలు చేసిన నాగార్జున పిటిషన్ నిలబడదని తాము అనుకుంటున్నామని అన్నారు. ఈ కేసు విచారణలో మూడు కాంట్రిడిక్షన్స్ ఉన్నాయి, నాగార్జున పిటిషన్ లో ఒకటి చెప్పారు, స్టేట్మెంట్లో మరొకటి చెప్పారని అన్నారు. అలాగే సుప్రియ విట్నెస్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆమె మరొక అంశం చెప్పారని, అసలు కోర్టు సుప్రియ విట్నెస్ ని ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందో చూడాలని అన్నారు. అలాగే 10వ తేదీ మరొక విట్నెస్ కూడా రికార్డు చేయాలి కాబట్టి మేము ఈ కేసు కోర్టులో నిలబడదని అనుకుంటున్నామని అన్నారు. ఒకవేళ విట్నేసులను పరిగణలోకి తీసుకొని మంత్రికి నోటీసులు జారీ చేస్తే లీగల్ గా ఎదుర్కొంటామని అన్నారు. అలాగే మంత్రి కొండా సురేఖ పై సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులపై డీజీపికి రేపు ఫిర్యాదు చేస్తామని అన్నారు.