NTV Telugu Site icon

KA 11 : కిరణ్ అబ్బవరం 11వ సినిమా టైటిల్ ‘K’ RAMP’

Ka

Ka

గతేడాది “క” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త మూవీ దిల్ రుబా రిలీజ్ కు రెడీ గా ఉంది. ఈ సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్ లో 10వ సినిమాగా రానుంది.. ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొత్త దర్శకుడు విశ్వ కరుణ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.

Also Read : NTRNeel : ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్.. సాధ్యమయ్యే పనేనా..?

కాగా నేడు కిరణ్ అబ్బవరం మరో సినిమాను ప్రకటించాడు. తన కెరీర్ లో 11 వ సినిమాగా వస్తున్న ఈ సినిమాను హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ విషయాన్నీ అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఈ నేపథ్యంలో రేపు ఈ సినిమా పూజా కార్యక్రమాలను రామానాయుడు స్టూడియోస్ లో నిర్వహించబోతున్నారు. అలాగే టైటిల్ ను కూడా వెల్లడించనున్నారు మేకర్స్. యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘K’ RAMP అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలిస్తుంది. రేపు ఈ టైటిల్ ను అధికారకంగా ప్రకటించనున్నారు. హాస్య మూవీస్ బ్యానర్ లో 7 వ సినిమాగా రానున్న ఈ సినిమను కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే భారీ బడ్జెట్ పై నిర్మించనున్నారు నిర్మాత రాజేష్ దండా. ఈ సినిమాకు సంబందించిన ఇతర వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.