Site icon NTV Telugu

KINGDOM : నేడు కింగ్‌డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ట్రాఫిక్ ఆంక్షలు వివరాలు వెల్లడించిన పోలీస్ శాఖ..

Vd12

Vd12

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కింగ్‌డమ్’. మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన కింగ్‌డమ్ ట్రైలర్ ను విశేష స్పందన రాబట్టింది. కాగా నేడు హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో కింగ్‌డమ్ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు. ఆ కారణంగా నగరంలోని పలు మార్గాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. వాటి వివరాలను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసారు.

 ట్రాఫిక్ మల్లింపు వివరాలు : 

1. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ → KVBR స్టేడియం: కృష్ణ నగర్ Jn వద్ద మళ్లించబడింది. శ్రీనగర్ కాలనీ – పంజాగుట్ట మీదుగా.

2. మైత్రీవనం → జూబ్లీహిల్స్/మాదాపూర్: యూసుఫ్‌గూడ బస్తీ వద్ద RBI క్వార్టర్స్ – కృష్ణా నగర్ – జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మీదుగా మళ్లించబడింది.

3. మైత్రీవనం → బోరబండ: కృష్ణకాంత్ పార్క్ – కళ్యాణ్ నగర్ – బోరబండ మీదుగా సవేర ఫంక్షన్ హాల్ వద్ద మళ్లించారు.

4. బోరబండ → మైత్రీవనం: ప్రైమ్ గార్డెన్ – మిడ్‌ల్యాండ్ బేకరీ – GTS కాలనీ – ICICI U-టర్న్ – మైత్రీవనం మీదుగా మళ్లించబడింది.

𝗣𝘂𝗯𝗹𝗶𝗰 𝗣𝗮𝗿𝗸𝗶𝗻𝗴 𝗔𝗿𝗲𝗮𝘀:

• మెట్రో పార్కింగ్ (జానకమ్మ తోట 1 & 2), యూసుఫ్‌గూడ.

• సవేరా ఫంక్షన్ హాల్ & మహమూద్ ఫంక్షన్ హాల్ (4-వీలర్లు మాత్రమే).

ఏదైనా సహాయం కోసం, ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626 కు కాల్ చేయండి. లైవ్ అప్‌డేట్‌ల కోసం ట్విట్టర్‌లో @HYDP మరియు ఫేస్‌బుక్‌లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను అనుసరించండి.

Exit mobile version