రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’. వరుస డిజాస్టర్ల తర్వాత విజయ్ నుంచి రాబోతున్న ఈ చిత్రం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ చిత్రం మే 30నే రిలీజ్ కావాల్సి ఉండగా వివిధ కారణాలతో జులై 4కి వాయిదా పడింది. ఈ విషయాన్ని మేకర్స్ ఇటీవలే అఫిషీయల్‌గా ప్రకటించారు.. అయినప్పటికీ
రిలీజ్ విషయంలో పలు వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు రీ షూట్ చేస్తున్నారన్ని.. ఫైనల్ కట్ చూసిన తర్వాత డైరెక్టర్ గౌతమ్ కాస్త అసంతృప్తిగా ఫీలయ్యాడని.. అందువల్ల కొన్ని కీలక సన్నివేశాలను మళ్లీ షూట్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘కింగ్డమ్’ మేకర్స్ ఈ వార్తలకు చెక్ పెట్టారు. ‘మా సినిమా ఎలాంటి రీషూట్ జరుపుకోవడం లేదు.ఎలాంటి వాయిదాలు వేయడం లేదు. మా సినిమా అనుకున్న డేట్‌కు అనుకున్నట్లుగానే సాలిడ్‌గా వస్తుంది.. కాకాపోతే తుఫాను వచ్చే ముందు నిశ్శబ్దం ఇలాగే ఉంటుంది’ అని వారు పేర్కొన్నారు. మొత్తానికి క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక విజయ్ దేవరకొండ కి చాలాకాలంగా భారీ హిట్ కోసం చూస్తున్నాడు. ‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘లైగర్’, ‘ఫ్యామిలీ స్టార్’ వంటి బ్యాక్ బ్యాక్ చిత్రాలు తీసిన అని డిజాస్టర్ కాగా.. ‘ఖుషీ’ కాస్త పర్వాలేదనిపించింది. దీంతో విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’పై చాలా ఆశలే పెట్టుకున్నాడు. మరి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి..
