కన్నడ స్టార్ హీరో సుదీప్ తెలుగు ప్రేక్షకులు కూడా సుపరిచితమే. ఆయన కన్నడ స్టార్ హీరో లలో ఒకరు. అంతేకాకుండా తెలుగు హిందీ భాషల్లో కూడా సుదీప్ పలు సినిమాల్లో నటించాడు. తాజాగా ఈ హీరో వరల్డ్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ తో చెస్ గేమ్ ఆడబోతున్నాడు అట. విశ్వనాథన్ ఆనంద్ చెస్ లో 5 సార్లు వరల్డ్ చాంపియన్ గా నిలిచారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు వీరిద్దరి మధ్య చెస్ గేమ్ సాగనుంది. ఈవెంట్ ద్వారా ఫండ్స్ సేకరించి ఓ స్వచ్ఛంద సంస్థకు సాయం చేసేందుకు భారత్ చెస్ వారు ప్రయత్నిస్తున్నారు. చెస్ కామ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ లో ఈ గేమ్ లైవ్ కానుంది. ఈ సందర్భంగా ఇవ్వాలనుకునే వారు Akshayapatra.org/chackmate-covid అనే లింక్ ను ఓపెన్ చేసి ఇ విరాళం ఇవ్వాల్సిందిగా నిర్వాహకులు కోరారు. మరి మన వరల్డ్ ఛాంపియన్ తో గేమ్ ఆడి కన్నడ హీరో గెలుస్తాడా లేదో చూడాలి.
వరల్డ్ చెస్ ఛాంపియన్ తో స్టార్ హీరో గేమ్…!
