హాటెస్ట్ బ్యూటీ కియారా అద్వానీ తన త్రోబాక్ ఫోటోలు, వీడియోలతో ఇంటర్నెట్‌ను బ్రేక్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఆదివారం, జూలై 4న తన ఇన్‌స్టాగ్రామ్‌లో మాల్దీవుల పర్యటన సమయంలో తీసుకున్న అద్భుతమైన బికినీ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో కియారా హాట్ గా, టోన్డ్ బాడీతో పసుపు రంగు బికినీలో మెరిసిపోతోంది. ఈ పిక్ ను పోస్ట్ చేసిన కొన్ని గంటలోనే దాదాపు లక్ష లైకులు వచ్చాయి. ఆమె అభిమానులు ఈ పిక్ ను షేర్ చేస్తూ నెట్టింట్లో సంచలనం సృష్టిస్తున్నారు. ఈ పిక్ పై బాలీవుడ్ స్టార్ సెలెబ్రిటీలు కామెంట్ చేశారు.
Read Also : ఇక సిబిఎఫ్‌సి ఎందుకు?… సినిమాటోగ్రాఫ్ బిల్ పై సుధీర్ బాబు
సారా అలీ ఖాన్, టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, హృతిక్ రోషన్, నవ్య నవేలి నందా తదితరులు ఈ ఫోటోపై స్పందించారు. కియారా బాయ్ ఫ్రెండ్ గా ప్రచారం జరుగుతున్న స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ఈ పిక్ ను లైక్ చేయడం విశేషం. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. రామ్ చరణ్ తో “ఆర్సి15″లో హీరోయిన్ గా నటించనుంది. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ధర్మ ప్రొడక్షన్స్ మూవీ ’షేర్‌షా’లో కియారా అద్వానీ కనిపిస్తుంది. కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవిత కథ ఆధారంగా ఈ వార్ మూవీని రూపొందిస్తున్నారు. షేర్ షా’ ఈ సంవత్సరం జూలైలో విడుదల కావాల్సి ఉంది. కరోనా మహమ్మారి పరిస్థితి దృష్ట్యా సినిమా విడుదల వాయిదా పడింది. ‘జగ్ జగ్ జీయో’ అనే చిత్రంలో కూడా నటిస్తోంది. ఇందులో వరుణ్ ధావన్, నీతు సింగ్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
